Sunday, March 22, 2026

మందుబాబులకు సామాజిక సేవా శిక్ష

నేటి సాక్షి, మందమర్రి:– ఇటీవల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టణ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిలో 13 మంది మందుబాబులకు మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో క్లీనింగ్ చేసే సామాజిక సేవా శిక్షను విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిందని పట్టణ ఎస్సై ఎస్ రాజశేఖర్ గురువారం ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహణలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిని గురువారం కోర్టులో హాజరు పరచగా వారికి మంచిర్యాల ఫస్ట్ అడిషనల్ జూనియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ 13మంది మందు బాబులకు 2 రోజులు మంచిర్యాల లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో క్లీనింగ్ పనులు నిర్వహించాల్సిందిగా కమ్యూనిటీ సర్వీసులో శిక్ష విధిస్తూ, తీర్పును వెల్లడించిందని తెలిపారు. వాహనదారులు విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ, వాహనాలు నడపాలని, మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News