Wednesday, March 11, 2026

అర్హులైన ప్రతి ఒక్కరికి పరిహారం అందజేత

జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-
జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా మంచిర్యాల, వరంగల్‌, ఖమ్మం, విజయవాడ జాతీయ రహదారి 163జి నిర్మాణంలో భూములు కోల్పోయిన అర్హులైన ప్రతి ఒక్కరికి పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రాజస్వ మండల అధికారి కార్యాలయంలో జాతీయ రహదారి విస్తరణలో బాధితుల కోల్పోయిన వివరాలను మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జాతీయ రహదారి 163జి 384 కిలోమీటర్ల మేర ఉంటుందని, రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన వారి జాబితా ప్రకారం బాధితులకు నష్టపరిహారం చెల్లించడం జరిగిందని, ఆర్బిట్రేషన్‌ కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి పరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. మొదటి జాబితాలో పరిహారం అందని అర్హత గల వారు సంబంధిత పత్రాలు, బ్యాంక్‌ పాస్‌ పుస్తకాలతో సంప్రదించినట్లయితే రికార్డులు పరిశీలించి సరిగ్గా ఉన్నట్లు నిర్ధారణ జరిగితే సంబంధిత లబ్దిదారుల నుండి అక్విటెన్సీ తీసుకొని పరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని, నిర్ధేశిత ధరలననుసరించి పరిహారం చెల్లించబడుతుందని, ఆలస్యం చేయకుండా నష్టపోయిన వారు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News