నేటి సాక్షి, రామడుగు (పురాణం సంపత్):
తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ గత కొద్ది రోజుల క్రితం రెడ్డి కులస్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను బుధవారం రామడుగు మండలంలోని గోపాలరావుపేట శ్రీ వీరాంజనేయ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్నపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షులు పీచు రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కర్ర విద్యాసాగర్ రెడ్డి, కోశాధికారి చాడ దామోదర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి నరసింహారెడ్డి, పబ్బతి మల్లారెడ్డి, కర్ర అశోక్ రెడ్డి ఎడవెల్లి మల్లా రెడ్డి, దాసరి నారాయణరెడ్డి, ఎడవల్లి మహిపాల్ రెడ్డి,చాడ హనుమంత రెడ్డి పాల్గొన్నారు.





