Monday, March 23, 2026

జిల్లాలోని అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ స్కూల్స్ పై జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు

  • బీఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య

నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ గారికి జిల్లాలోని ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు మరియు బస్సులలో సీట్ల పరిమితి కంటే ఎక్కువగా విద్యార్థులను తరలించడంపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య మాట్లాడుతూ… జిల్లాలోని ప్రైవేట్ స్కూలు యజమాన్యం ఆగడాలు రోజు రోజు కు పెరిగిపోతు స్కూల్స్లలో సరైన సదుపాయాలు లేకుండా సరైన విద్యార్ధలేని టీచర్లతో తక్కువ జీతాలు ఇస్తూ న్యాన్యమైన విద్యను అందించకుండా. కేవలం అధిగ ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారం చేస్తూ విద్యార్థులను చిత్రహింసలు పెడుతున్నారు. తక్షణమే వారి పైన చర్యలు తీసుకోవాలి మరియు ఎంఈఓ ల పర్యవేక్షణ కరువైంది వారు తనిఖీలు చేయడం లేదు. ఇది ఇయర్ ఎండింగ్ కాబట్టి స్కూల్ యజమాన్యాలు టెన్త్ క్లాస్ విద్యార్థులకు మొత్తం ఫీజు చెల్లిస్తేనే హాల్ టికెట్లు ఇస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రైవేటు స్కూల్స్లలో బాత్రూమ్స్ టాయిలెట్స్, లెట్రిన్స్ రూమ్స్ లేవు. ఆట స్థలాలు లేవు. రోడ్ల పక్కన స్కూల్స్ ఉండడం వలన సౌండ్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ వల్ల విద్యార్థులకు తీవ్రమైన ఇబ్బందులు. కొన్ని స్కూళ్లలో బాత్రూమ్స్ లేకపోవడం వల్ల టాయిలెట్ సమయంలో విద్యార్థులు బహిరంగ ప్రదేశాలలో గుంపులు గుంపులుగా వెళ్లి మూత్ర విసర్జన చేస్తున్నారు. ఫైర్ సేఫ్టీ లేదు. కాంపౌండ్ వాల్స్ లేవు. సరిపడి టీచర్లు లేరు ఫీజుల కోసం విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఉదాహరణ కు ఐజ లోని కృషవేణి స్కూల్లో విద్యార్థిని ఫీజు కోసం చితుకబాదినారు. సమయపాలన పాటించడం లేదు. డి ఏడ్, బీ ఎడ్ లేని వారి మరియు టెట్ అర్హత లేనివారితో తక్కువ జీతాలు ఇచ్చి నాణ్యత లేని విద్యను బోధిస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రైవేటు స్కూల్స్ పైన చర్యలు తీసుకొని ఫీజులు నియంత్రించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా స్కూల్ బస్సులలో పరిమిత సీట్ల కన్నా అదనంగా విద్యార్థులను గ్రామాల నుంచి బస్సులో నిలబెట్టుకుని తరలిస్తున్నారు. వెంటనే డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు ఈ బస్సుల పైన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా సీట్ల పరిమితకీ లోబడే విద్యార్థులను ఎక్కించాలి. తక్షణమే బస్సుల ఫిట్నెస్ లేని వాటిని సీజ్ చేయాలి అని జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య తెలిపారు ఈ కార్యక్రమం లో మాధవ్, గోపాల్ తదితరులు ఉన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News