Friday, March 13, 2026

అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయండి

  • స్మార్ట్ సిటీ పనులను పరిశీలించిన కమిషనర్ ఎన్. మౌర్య

నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) : స్మార్ట్ సిటీ నిధులతో తిరుపతి నగరంలో చేస్తున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. నగరంలో స్మార్ట్ సిటీ నిధులతో జరుగుతున్న సిటీ ఆపరేషన్ సెంటర్(నగరపాలక సంస్థ కార్యాలయం), మల్టి లెవల్ కార్ పార్కింగ్, శ్రీనివాస సేతు లో పెండింగ్లో ఉన్న సుందరీకరణ, మురుగునీటి కాలువలు, వినాయక సాగర్ వద్ద పెండింగ్ లో ఉన్న కూరగాయల మార్కెట్, స్విమ్మింగ్ పూల్ పనులను ఇంజినీరింగ్, స్మార్ట్ సిటీ అధికారులతో కలసి సోమవారం ఉదయం కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో బాగంగా నగరంలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. అన్ని అభివృద్ధి పనులకు గడువు ఇవ్వడం జరిగిందని అన్నారు. అన్ని గడువు లోపు నాణ్యతలో పూర్తి చేయాలని అన్నారు. కొర్లగుంటా వద్ద మురుగునీటి కాలువ నిర్మాణంపై ఎక్కువ పిర్యాదులు వస్తున్నాయని త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, స్మార్ట్ సిటీ ఈ.ఈ. చంద్రశేఖర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డి.ఈ.లు రాజు, మధు, రమణ, లలిత, వెంకట ప్రసాద్, ఏ.సి.పి. బాలాజి, ఏఈకాం ప్రతినిధి బాలాజి, శానిటరీ సూపర్ వైజర్ సుమతి, తదితరులు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News