Tuesday, March 10, 2026

రైతు రుణమాఫీని త్వరగా పూర్తి చేయండి

  • ఏటూరు నాగారం వద్ద స్పైస్ పార్క్ ఏర్పాటుకు చర్యలు తీసుకోండి
  • రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డిని కోరిన జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి

నేటి సాక్షి/ మంగపేట : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రూ రెండు లక్షల వరకు రుణమాఫీ ప్రక్రియను వేగవంతం చేసి రైతులను రుణ విముక్తులను చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ యం కోదండ రెడ్డి కి జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి విజ్ఞప్తి చేశారు గురువారం నిజామాబాద్ జిల్లా కమ్మరిపల్లి పసుపు పరిశోధనా స్థానం సందర్శన కార్యక్రమంలో భాగంగా సాంబశివరెడ్డి కోదండ రెడ్డితో భేటీ అయి వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న పలు సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు రైతు రుణమాఫీ పూర్తికాక రైతాంగం అనేక ఆర్థిక కష్ట నష్టాలను ఎదుర్కొంటుందని రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేసేందుకు చివరి విడత నిధులు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు ఏటూరు నాగారం వద్ద స్పైస్ పార్క్ ఏర్పాటు చేసి సుగంధ పారిశ్రామిక వాడ ని అభివృద్ధి చేయాలని కోరారు త్వరలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల లో పర్యటనకు రావాలని రైతు కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను సాంబశివ రెడ్డి కోరారు ఈ సందర్భంగా రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డికి సాంబశివరెడ్డి సుగంధ ద్రవ్యాలను బహుకరించారు అనంతరం తెలంగాణ స్టేట్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అవినాష్ రెడ్డిని సాంబశివరెడ్డి కలిసి గోవిందరావుపేట తెలంగాణ సీడ్ కార్పొరేషన్ ప్రాసెసింగ్ ప్లాంటు సందర్షణకు రావాలని అదేవిధంగా తెలంగాణ స్టేట్ సీడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వరి విత్తన ఉత్పత్తి విస్తీర్ణాన్ని పెంచేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యాన అధికారులతో పాటు స్పైసెస్ బోర్డ్ నిజామాబాద్ డిడి సుందరేషన్ విశ్రాంత డిడి డాక్టర్ గాది లింగప్ప తదితర అధికారులతో పాటు వికాస్ అగ్రీ ఫౌండేషన్ వైస్ చైర్మన్ పచ్చిపులుసు నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News