Thursday, March 26, 2026

దేవన్నపేట ఉన్నత పాఠశాలలో కాంప్లెక్స్ స్థాయిలో ప్రతిభా పాటవ పోటీలు

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం దేవన్నపేట జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాంప్లెక్స్ స్థాయిలో విద్యార్థులకు పఠన, లిఖిత, గణితోత్సవ ప్రతిభా పాటవ పోటీలను నిర్వహించడం జరిగింది. విద్యార్థుల లో దాగి వున్న సృజనాత్మకతను వెలికి తీయడం వారి నైపుణ్యాలను పరిశీలించి ప్రోత్సహించడం లాంటి లక్ష్యాలకు అను గుణంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు డి. రమాదేవి మాట్లాడుతూ ఈ పఠన, లిఖిత, గణిత, ప్రతిభా పాటవాల పోటీల సందర్భంగా విద్యార్థుల యొక్క స్థాయిని అంచనా వేయడంతో పాటు వారికి కావలసిన శిక్షణ అవసరాన్ని తెలుసు కోవడానికి ఉపయోగ పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ స్థాయిలో ఉన్న 12 పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులందరికీ బహుమతి ప్రధానం చేయడం జరిగిందనీ ప్రధానోపాధ్యాయురాలు డి. రమాదేవి తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News