నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి.(రాఘవుల శ్రీనివాసు): స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల హుజరాబాద్ లో మహిళా దినోత్సవం పురస్కరించుకొని, కళాశాల మహిళా సాధికారత విభాగము మరియు జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో, ఈరోజు మహిళా సాధికారత పై విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు శ్రీమతి ఏ. శోభారాణి ,ఈ సదస్సుకు ముఖ్య వక్త గా హాజరైనారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ, విద్యార్థులు, ముఖ్యంగా మహిళా విద్యార్థులు ,విద్యార్థి దశ నుండే , రాష్ట్ర జాతీయ మరి అంతర్జాతీయ స్థాయిలో మహిళ హక్కుల పరిరక్షణ చట్టాలు, వాటిని అమలు చేసే యంత్రాంగము, స్వీయ రక్షణ మరియు తోటి వారిని రక్షించే విధానము మొదలగు అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా దేవి మాట్లాడుతూ అక్షరాస్యతతోనే మహిళా సాధికారత సాధ్యపడుతుందని, విద్యార్థులు కష్టపడి చదివి అన్ని రంగాల్లో రాణించి స్వయం సాధికారత పొందాలని, సమాజంలోని మహిళలను నిత్యం చైతన్య పరచాలని పేర్కొన్నారు. మహిళా దినోత్సవం పురస్కరించుకొని కళాశాలలో గత మూడు రోజులుగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మల్లారెడ్డి, అకడమిక్ సమన్వయకర్త లింగారెడ్డి, ఐక్యూఏసి సమన్వయకర్త డాక్టర్ రేణుక, అధ్యాపకులు డాక్టర్ ఝాన్సీరాణి, డాక్టర్ సుమలత, డాక్టర్ స్వప్న, రమ పల్లవి ,మంగమ్మ, డాక్టర్ నరేందర్ డాక్టర్ మహిపాల్ రెడ్డి, శ్రీధర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.



