నేటిసాక్షి బ్యూరో, నిజామాబాద్ (టి.ఎన్ రమేష్) :
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో స్థానిక సంస్థ గత ఎన్నికల్లో, గెలుపే ధ్యేయంగా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదేశాల మేరకు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువ నాయకులు, నియోజకవర్గంలోని పలు గ్రామాలలో, గడపగడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను, ప్రభుత్వం ప్రజల కొరకు చేపడుతున్న వివిధ కార్యక్రమాలను, విరివిగా ప్రచారం చేస్తూ గ్రామ గ్రామాన, గ్రామ కమిటీలు, బూత్ లెవెల్ కమిటీలను, ఏకం చేస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. జనవరి 26 నుండి అర్హులైన లబ్ధిదారులకు, రైతు భరోసా, రైతు కూలీలకు ఇచ్చే 12 వేల రూపాయలు, భూమిలేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నియోజకవర్గంలో 12,000 వేల రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ నాయకులు ప్రచారంలో భాగంగా ప్రజలకు తెలియజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు నాయకులు పనిచేయాలని పార్టీ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, మాజీ జెడ్పిటిసి ఉషా గౌడ్, మాజీ సొసైటీ చైర్మన్ బోండ్లసాయిలు, సొసైటీ వైస్ చైర్మన్ పద్మారావు, రుద్రారం సర్పంచ్ సత్తయ్య, అల్మాజిపూర్ సర్పంచ్ మాధవి దత్తు, సాతేల్లి సర్పంచ్ సంగమేశ్వర్, మల్లయ్య పల్లి సర్పంచ్ ఎల్లయ్య, గ్రామ అధ్యక్షుడు నాగరాజు, రుద్రారం గ్రామ అధ్యక్షుడు రుక్మారెడ్డి, అల్మాజిపూర్ గ్రామ అధ్యక్షుడు హనుమంతు, మల్కాపూర్ గ్రామ అధ్యక్షుడు కటికల శ్రీను, మత్తమాల గ్రామ అధ్యక్షుడు సల్మాన్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





