- ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ
నేటి సాక్షి, మానకొండూరు : మానకొండూర్ నియోజకవర్గ పట్టభద్రుల, కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశం నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మానకొండూర్ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ పట్టభద్రులు అందరూ తమ అమూల్యమైన ఓటును అభ్యర్థి వూట్కూరి నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో బెజ్జంకి మండల నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి, ఎఎంసి చైర్మన్ పులి కృష్ణ, వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ రెడ్డి, యూత్ అధ్యక్షులు కర్రావుల సందీప్,ప్రధాన కార్యదర్శి శానగొండ శరత్, డైరెక్టర్ మచ్చ కుమార్,పులి సంతోష్, పోతిరెడ్డి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




