Monday, March 23, 2026

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలి

నేటి సాక్షి, మందమర్రి:– జరగనున్న ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలుపుకు యువజన కాంగ్రెస్, కాంగ్రెస్ నాయకులు కృషి చేయాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి బంధం ఉమేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రావుల అనిల్, చెన్నూరు నియోజకవర్గం అధ్యక్షుడు ఎండి నయీం లు కోరారు. శనివారం పట్టణంలోని ఐఎన్టియుసి కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి బంధం ఉమేష్ రెడ్డి ని శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో అతిథులు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నోముల రాజేందర్ గౌడ్, రేవెల్లి శ్రీకాంత్, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, నాయకులు చోటు మియా, తిరుపతి, రాజ్ కుమార్, వంశీ లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News