Friday, April 3, 2026

హామీల అమలులో చిత్తశుద్ధి చాటుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం

  • ఎస్సీ, బీసీ బిల్లుల ఆమోదంపై కాంగ్రెస్ నాయకులు హర్షం
  • అనంతగిరి మండల పార్టీ అధ్యక్షుడు ముసుకు శ్రీనివాస్ రెడ్డి

నేటి సాక్షి కోదాడ, (అనంతగిరి) : బీసీ రిజర్వేషన్‌తో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లులకు అసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదం తెలిపినందుకు హర్షం వ్యక్తం చేస్తూ మండల కాంగ్రెస్‌ శ్రేణులు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి తోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయాల్లో ముఖ్య కార్యకర్తలు సమావేశంలో భాగంగా బీసీ ఎస్సీ వర్గీకరణ ఆమోదపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు ముసుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్యా, ఉద్యోగ నియామకాల్లో, స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బీసీ రిజర్వేషన్ బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోద ముద్ర వేయడం సంతోషంగా ఉందన్నారు.ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు రిజర్వేషన్ల పెంపుకు కృషి చేశారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతామని రాహుల్ గాంధీ ఆనాడు హామీ ఇచ్చారని, బాధ్యతలు చేపట్టగానే 4ఫిబ్రవరి 2024లో బీసీ కులగణన ప్రక్రియను మొదలు పెట్టారన్నారు. ఇది చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించే రోజు అని, బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా లబ్ది పొందుతారన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు పాస్ అయినందున చాలా సంవత్సరాల కల నెరవేరిందని అన్నారు.ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన చెయ్యని పని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని ప్రజలు ఇది గమనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుర్ర పుల్లారెడ్డి, మాజీ ఎంపీపీ చుండూరు వెంకటేశ్వరరావు, గునుకుల గోపాల్ రెడ్డి, జొన్నలగడ్డ కోటేశ్వరరావు,ఈదుల కృష్ణయ్య భానోత్ బాబు నాయక్, ముత్తినేని కోటేశ్వరరావు,గుర్రం వెంకటరెడ్డి, బుర్ర నర్సిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ధారావత్ రామ, జ్ఞానేందర్ రెడ్డి, రవి నాయక్, ముక్క కాశి గౌడ్, రాఘవరెడ్డి, కిరణ్ రెడ్డి, రామారావు, మట్టపల్లి రామకోటయ్య, వేదాంతరావు,వేణు, నాగేంద్రబాబు, సాదే కోటేశ్వరరావు, బోడపూడి సత్యనారాయణలక్ష్మీనారాయణ, మేకల శ్రీను వీరన్న, నాగార్జున, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News