Monday, March 30, 2026

రైతులను దగా చేస్తున్న కాంగ్రెస్ సర్కార్: హన్మంత రావు

  • బోనస్ పేరుతో బోగస్ చేస్తున్నారు
  • రైతు డిక్లరేషన్ అంతా బూటకం
  • రహదారిపై బైఠాయించి నిరసన తెలిపిన భాజపా

నేటి సాక్షి, ఎండపల్లి (రియాజ్): సన్న వడ్లు అమ్ముకుని మూడు నెలలు గడుస్తున్న బోనస్ డబ్బులు విడుదల చేయకుండా కాంగ్రెస్ పార్టీ రైతులను దగా చేస్తోందని భాజపా నేతలు ఆరోపించారు. మండల కేంద్రంలోని స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం భాజపా మండల అధ్యక్షులు రావు హన్మంత రావు ఆధ్వర్యంలో రాష్ట్ర కౌనిల్స్ సభ్యులు కొమ్ము రాంబాబు, కార్యకర్తలు, రైతులతో కలిసి రాష్ట్ర రహదారిపై బైఠాయించి దర్నా-నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా హన్మంత రావు మాట్లాడుతూ… అమలు కానీ అడ్డగోలు హమీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నెరవేర్చడంలో పూర్తిగా విఫలం అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రకాల వడ్లకు భోనస్ హమీ ఇచ్చి తరువాత మాటమార్చి సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పి నేడు వాటిని కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ బోగస్ చేస్తోందన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఆవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో రైతులు అప్పుల పాలై ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేసారు. ఎన్నికల సమయంలో వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ పేరుతో మద్దతు ధర, రైతు భరోసా, బోనస్ లంటూ రైతులకు అడ్డగోలు హమీలతో ఆశ చూపి ఆధికారంలోకి వచ్చి నేడు అమలు చేయకుండా బూటకం చేస్తోందని విమర్శించారు. కొమ్ము రాంబాబు మాట్లడుతూ… గత ప్రభుత్వం హయంలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాలో రోడ్లు ఎక్కి రైతులకు అండగా ఉన్నామని ప్రగల్భాలు పలికి నేడు ఆధికారంలోకి వచ్చాక రైతులను పట్టించుకోవడం లేదని, సాగు నీరు అందక పొట్ట దశలో పంటలు ఎండిపోతున్నాయని, రైతులు ఎరువుల కోసం చెప్పులు వరుసలో పెట్టి పడిగాపులు కాస్తున్నారని, కాంగ్రెస్ పాలనలో కరువు వచ్చి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఒక్కటి అన్నట్టుగానే మార్పు మార్పు అంటూ అనాటి రోజులు తెచ్చాడని ఎద్దేవా చేశారు. సుమారు గంట పాటు సాగిన ధర్నా-నిరసన కార్యక్రమంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విషయం తెలిసిన పోలీసులు దర్నా స్థలికి చేరుకుని నిరసన విరమింపజేశారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో సన్న వడ్ల బోనస్ నిధులు విడుదలతో పాటు ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో భాజపా ప్రధాన కార్యదర్శి పొన్నం నరేష్, సబ్బ సంతోష్, ఉపాద్యక్షులు గోపనవేణి గంగాచలం, ఓబిసీ మోర్చా అధ్యక్షులు అమరగొండ దివాకర్, బీజెవైఎం అధ్యక్షులు జక్కుల సాగర్, నాయకులు ఎనగంటి నరేష్, గుడాల తిరుపతి, పొన్నం కిరణ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News