Saturday, March 28, 2026

వరంగల్ నగర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది

  • సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం లో వరంగల్ దశ దిశ మారనుంది
  • రాష్ట్ర ప్రభుత్వం కృషి వల్లే ఎయిర్ పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
  • బీ ఆర్ ఎస్ నాయకుల తీరు విచిత్రంగా ఉంది. పనిచేసింది ఒకరైతే మేమే తెచ్చామని చెప్పుకోవడం సిగ్గు చేటు
  • వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు మరియు హన్మకొండ జిల్లా పార్టీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, కె. ఆర్ నాగరాజు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ , కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి లతో కలసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కృషి వల్లే ఎయిర్ పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పునరుద్ఘటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లో వరంగల్ దశ దిశ మారబోతుందని ఎంపీ స్పష్టం చేశారు. తెలంగాణ రెండో రాజధానిగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. బీ ఆర్ ఎస్ నాయకుల తీరు విచిత్రంగా ఉందని, పనిచేసింది ఒకరైతే మేమే తెచ్చామని చెప్పుకోవడం సిగ్గు చేటు అని విమర్శించారు. గత పదేళ్ల బి ఆర్ ఎస్ పాలనలో ఎన్ ఓ సి కొరకు ఒక్కసారైనా ప్రయత్నం చేశారా అంటూ సూటిగా ప్రశ్నించారు.శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో మరో విమానాశ్రయం ఉండ కూడదని గతంలో జీఎంఆర్‌ సంస్థతో ఒప్పందం ఉండడంతో దీనిపై సీఎం రేవంత్ రెడ్డి పౌర విమానయాన శాఖతో చర్చించి గత నెల 25న ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ కు లేఖ రాయడం జరిగిందని పేర్కొన్నారు. దీనిని హెచ్ఏఎల్ కు పంపడంతో అక్కడి నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ రావడంతో మామునూరు ఎయిర్ పోర్ట్ కు కేంద్రం అనుమతి నిచ్చిందని తెలియజేశారు. విమానాశ్రయ విస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణ కోసం 205 కోట్లను విడుదల చేస్తూ.. ప్రభుత్వం జీవో జారీ చేసిందని తెలియ జేసారు. ముఖ్యమంత్రి పర్యవేక్షణలో మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణం అద్భుతంగా ఉండ బోతుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏయిర్ పోర్ట్ అభివృద్ధితో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజి, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, టెక్స్ టైల్ పార్క్, ఐటి, పర్యాటక, పారిశ్రామిక అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని వెల్లడించారు.వరంగల్ మహా నగరంలో 20 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార దిశగా కృషి చేస్తున్నామన్నారు. రైల్వే సమస్యల పరిష్కార దిశగా కృషి చేస్తానని ఎంపీ తెలిపారు. రైల్వే డివిజన్ ఏర్పాటు విషయం పై కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కులుస్తామని తెలిపారు. కాజీపేట రైల్వే బ్రిడ్జి పనులు త్వరలో పూర్తవుతాయన్నారు. వరంగల్ నగర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రానున్న రోజుల్లో వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులు అందరం కలిసి కట్టుగా జిల్లాను మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News