Monday, March 16, 2026

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను అవస్థల పాలు చేస్తుంది

  • ఎమ్మెల్యే సంజయ్

నేటి సాక్షి, మెట్ పల్లి : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను అవస్థల పాలు చేస్తుందని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ అన్నారు.మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా మెట్ పల్లి లో ఎమ్మెల్యే సంజయ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు గురువారం వినూత్న నిరసన చేపట్టారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 420 గ్యారెంటీలను అమలు చేయని అసమర్ధ పాలన కాంగ్రెస్ అంటూ పట్టణంలోని జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు ర్యాలీ తీశారు. అనంతరం జాతీయ రహదారిపై ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వానికి పైనుంచి బుద్ధి చెప్పాలంటూ మహాత్మునికి వినతి పత్రాన్ని అందించారు. మహాత్మ మన్నించవయ్యా కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పవయ్యా అంటూ నినాదాలు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రలో నుంచి లేచి ప్రజలకు కావాల్సిన పథకాలను అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News