Friday, April 3, 2026

ఆరు గ్యారెంటీల హామీలపై చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కార్

నేటిసాక్షి, గన్నేరువరం, ( బుర్ర అంజయ్య గౌడ్) : 6 గ్యారంటీలకు గారడీతో రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ వాటి అమలుపై చేతులు ఎత్తేసిందని జిల్లా స్వచ్ఛ భారత్ కన్వీనర్ కూన మహేష్ విమర్శించారు. రైతులకు రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయడంలో వివలం చెందిందని అన్నారు. మహిళలకు నెలకు 2500 ఊసే లేదని అన్నారు వృద్ధులకు 4000 పెన్షన్, ఇందిరమ్మ ఇండ్లకు అర్హులకు అందుతాయో లేదో ఆందోళన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పుట్టెడు అప్పులు తట్టెడు అబద్ధాలు తప్ప ఇచ్చిన హామీలను అమలు చేసే ఆలోచనలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేదని అన్నారు. దళితులు గిరిజనులు బహుజనులు ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసగించేలా ఈ బడ్జెట్ ఉందని అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News