Thursday, March 26, 2026

అన్నదాతకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

  • ఒక్క మహేశ్వరం నియోజకవర్గంలోనే రూ.76కోట్లపైగా రుణాలు మాఫీ.
  • భవిష్యత్ లోనూ రైతులకు అండగా ఉంటాం: లక్ష్మారెడ్డి (కెఎల్ఆర్)

నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్): ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రూ.2లక్షల రైతుల రుణాలు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి.మహేశ్వరం మండలంలో 3530 రైతులకు రూ. 25 కోట్ల 88 లక్షలు, కందుకూరు మండలంలో 5517 మంది రైతులకు 43 కోట్ల 29 లక్షలు, బాలాపూర్ మండలంలో 7 కోట్ల 38 లక్షల రుణాలు మాఫీ అయినట్లు కేఎల్ఆర్ తెలిపారు. ఒక్క మహేశ్వరం నియోజకవర్గంలో అన్నదాతలకు 76.55 కోట్ల రుణాలు మాఫీ చేశామని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు. టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల ఇంకా ఏవరికైనా కాకుంటే వివరాలను తుక్కుగూడ కాంగ్రెస్ కార్యాలయంలో అందిస్తే బ్యాంకర్లతో మాట్లాడతామని కిచ్చెన్న హామీ ఇచ్చారు.తొలుత రూ. 55కోట్లకుపైగా రుణామాఫీకి ప్రతిపాదనలు వచ్చినా ఆధార్ / బ్యాంకు అకౌంట్ కు మధ్య పేర్ల నమోదు తేడాతో వందల మంది రైతుల ఇబ్బందులు గమనించిన రైతుబిడ్డ లక్ష్మారెడ్డి… వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుదృష్టికి అర్హుల లిస్ట్ తీసుకెళ్లారు. వెంటనే అధికారులు, బ్యాంకర్లకు మంత్రివర్యుల సూచనలతో రూ. 20కోట్ల అదనపు రుణాలు మాఫీ జరిగింది. దీంతో అన్నదాతలు కేఎల్ఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయ పరంగా నష్టపోయిన రైతులను ఆదుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు లక్ష్మారెడ్డి.అప్పుల పాలై రైతన్నను ఆదుకునేందుకు రైతు రుణమాఫీ, భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నామని కేఎల్ఆర్ తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కు, వ్యవసాయమంత్రి తుమ్మల నాగేశ్వరరావు,ఇన్ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకి కృతజ్ఞతలు తెలిపారు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి.
కర్షకులకు భవిష్యత్ లో ఏ సమస్య వచ్చినా ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News