- రెబ్బనపల్లి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు రూ. 200 కోట్ల నిధులు విడుదల
- కాంగ్రెస్ మండల అధ్యక్షులు పింగిళి రమేష్
- సీఎం రేవంత్ రెడ్డి, పీఎస్ఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం
నేటి సాక్షి, లక్షెట్టిపేట ( బైరం లింగన్న ): విద్య, అభివృద్ధి, సంక్షేమానికి కాంగ్రెస్ సర్కార్ సమ ప్రాధాన్యత ఇస్తుందని లక్షెట్టిపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పింగిళి రమేష్ పేర్కొన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బేనపల్లిలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే పీ ఎస్ ఆర్ చిత్రపటాలకు కాంగ్రెస్ శ్రేణులు పాల అభిషేకం చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి రాష్ట్రంలో రూ.11600 కోట్లు నిధులు మంజూరు అయ్యాయని,మంచిర్యాల నియోజకవర్గం దండేపల్లి మండలంలోని రెబ్బనపల్లి గ్రామంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి రూ.200 కోట్లు నిధులు కేటాయించడం హర్షనీయమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు లకు నియోజకవర్గం ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్, పట్టణ అధ్యక్షులు ఆరిఫ్, అంకతి శ్రీనివాస్ ,మాజీ వైస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి, స్వామి, సందెల సురేష్ తదితరులు పాల్గొన్నారు.



