- వెంటనే 15000 రూపాయలను రైతు భరోసా ఆమాలు చేయాలి
- రోడ్డుపై కూర్చుని నిరసన తెలిపిన జోగులాంబ గద్వాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులు
- బాసు హనుమంతు నాయుడు
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : అబద్ధపు హామీలతో కాంగ్రెస్ రైతులను మోసం చేసిందని ఎన్నికల సమయంలో రైతు భరోసా రూ. 15 వేయిలు అందిస్తామని చెప్పి రూ. 12 వేలకు తగ్గించి ఇవ్వడం రైతులను మోసం చేయడమేనని బాసు హనుమంతు నాయుడు అన్నారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు గద్వాల నియోజకవర్గంలోని ధరూర్, కేటీదొడ్డి మండల లో పార్టీ నాయకులతో కలిసి ప్రధాన రహదారిపై కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిన రైతులకు రైతుబంధు అందించని దుస్థితిలో కాంగ్రెస్ ఉన్నదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రైతులకు రైతు భరోసా ఎకరాకు రూ. 15 వేలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని రైతులు పంట సాయం కోసం ఎదురుచూసి నిరాశే మిగిలిందన్నారు. ఎన్నికలో ఇచ్చిన హామీ ప్రకారం రైతు బంధు రూ. 15 వేలు ఇవ్వాలని, రూ.12 వేలు ఇస్తా మని ప్రభుత్వం ప్రకటించడం సరికాదన్నారు. రైతు బంధుకు కాంగ్రెస్ ఒక సంవత్సరం ఎగ్గొట్టిందని దానిని కలిపి రైతుల ఖాతాలో జమ చేయాలని బాసు హనుమంతు నాయుడు డిమాండ్ చేశారు. మిగిలిన రైతులకు రావల్సిన రూ. 2 లక్షల రుణమాఫీ ఇంకా తేల్చకుండానే ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. రూ. 15 వేల రైతుబంధును వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మోనేష్, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు అంగడి బసవరాజ్శ్రీ, రాములు, వెంకటేష్ నాయుడు, మాజీ సర్పంచ్ సామేలు, ముని మౌర్య, ఎస్.రాము నాయుడు, రవీందర్, అబ్రహం, కృష్ణ రెడ్డి, నక్క రవి, మల్లాపురం రవి, బోయలగూడెం నాగరాజు, భాసు గోపాల్ గుడిసె నరసింహ, బాసు నాయుడు, రవి నాయుడు, కంగారు తిమ్మప్ప, ముని, జక్కి ఆంజనేయులు, లోకేష్, వీరేష్, పవన్, అనిల్, రాజేష్, తిమ్మప్ప గౌడ్, సురేష్, గోపి, మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

