Monday, March 23, 2026

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు

బెజ్జంకి, నేటి సాక్షి: అదిలాబాద్-మెదక్-నిజామాబాద్-కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మానకొండూరు నియోజకవర్గం బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో పట్టభద్రులను కలిసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి వూట్కూరు నరేందర్ రెడ్డికి మద్దతు కోరారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 27న జరిగే ఎన్నికల్లో వూట్కూరు నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలంటూ కాంగ్రెస్ నాయకులు విజ్ఞప్తి చేశారు. కేవలం 14 నెలల్లో 55,000 ఉద్యోగాలు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, భవిష్యత్తులో నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలంటే నరేందర్ రెడ్డిని గెలిపించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ పులి కృష్ణ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండల అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి,  వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాసరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు పైడిపల్లి శంకర్, ఎర్రల రాజు, బైర సంతోష్, బొమ్మర వేణి సంతోష్, బండిపెళ్లి శ్రీనివాస్, దసనం శంకర్, కుట్ల తిరుపతి, మేడి శ్రీనివాస్, మేడి తిరుపతి, న్యాళం శ్రీనివాస్, కొలుకునూరి రమేష్, తూముల సంతోష్, ముత్యం సాగర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News