నేటి సాక్షి, ఇల్లందకుంట:
జాతి పితా మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఇల్లందకుంట మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో ఆ మహనీయునికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర్యోద్యమంలో అహింసా, సత్యం, సమానత్వ మార్గాలను పాటించి దేశానికి స్వాతంత్ర్యం రావడానికి కీలక భూమిక పోషించారు. అహింసా, సత్యం, సహనమే సమాజాన్ని ముందుకు తీసుకెళ్లగలవని ఆయన నిరూపించారు. నేటి సమాజంలో ప్రతీ ఒక్కరూ ఆయన జీవితాన్ని అధ్యయనం చేసి వారి స్పూర్తితో ఆ మహనీయుడు చెప్పిన మార్గాలలో నడువాలి. అహింసా సిద్ధాంతం, సేవాభావం అందరూ ఆచరించాలని నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.





