నేటి సాక్షి,బెజ్జంకి:
మండలంలోని గూడెం, గుండారం గ్రామాల్లో ఇటీవల మరణించిన వారి కుటుంబాలను గురువారం కాంగ్రెస్ నాయకులు పరామర్శించి కారణాలను అడిగి తెలుసుకున్నారు. గూడెం గ్రామానికి చెందిన నారెడ్డి సుదర్శన్ రెడ్డి తల్లి కౌసల్య,గుండారం గ్రామానికి చెందిన తాళ్ళపల్లి భీమయ్య తల్లి,తాళ్ళపల్లి సంజీవ్ తండ్రి, బెజ్జంకి గ్రామానికి చెందిన రామంచ రవి తండ్రి రామంచ దుర్గయ్య, కత్తి సాయి తండ్రి నర్సయ్య ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, మాజి ఏఎంసి చైర్మన్ అక్కరవేని పోచయ్య, ఆర్టీఐ ప్రచార కమిటీ చైర్మన్ రాసూరి మల్లికార్జున్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఐలేని శ్రీనివాస్ రెడ్డి, చెన్నాడి సుధాకర్ రెడ్డి,మిట్టపల్లి చెన్నారెడ్డి, గుడెల్లి లక్ష్మణ్, కోరుకొప్పుల సంపత్, బుపేందర్, పరకాల పర్శరాం తదితరులు పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

