- బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నగర్ దొడ్డి వెంకట్రాములు
- బీఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : ( రమేష్ ) : రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ- కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆడుతున్న నాటకంలో భాగమే, నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే వార్త. జూన్ 26న గద్వాల నియోజకవర్గ టిఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం బహిరంగం. నేటికీ టిఆర్ఎస్ లోనే ఉన్నానని ప్రకటించటం సిగ్గుచేటు అయిన ప్రకటన. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కార్యకర్తల నాయకుల బాగుకోసమే కాంగ్రెస్ లో చేరుతున్నానని బహిరంగ ప్రకటన చేసి *ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కాంగ్రెస్ కండువా కప్పుకుని అది కూడా దేవుని కండువా అంటూ చెప్పటం అంతకంటే దారుణం నయవంచన మరొకటి లేదు. సరితమ్మను నియోజకవర్గం ఇన్చార్జిగా తీసివేయమని అలిగి సాక్షాత్తు జిల్లా మంత్రి జూపల్లి ని ఇంటికి పిలిపించుకొని ఉజ్జగింపులకు పాల్పడి రేవంత్ తో మంతనాలు జరిపి తన ప్రయోజనాలను నెరవేర్చుకున్న సంగతి అందరికి తెలిసిందే. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, జమ్ములమ్మ ఆలయ కమిటీ చైర్మన్లను కాంగ్రెస్లో ఉండి తెచ్చుకున్నావా? లేక బీఆర్ఎస్ లో ఉండి తెచ్చుకున్నావా ? ప్రజలకు సమాధానం చెప్పగలవా..? మంత్రులను జిల్లాల్లో రప్పించి ర్యాలంపాడు,నెట్టెంపాడు ప్రాజెక్టులకు రప్పించి బహిరంగంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మాట్లాడిన తీరును ప్రజలకు గుర్తుండే ఉంటుంది. అయినా ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నారని ప్రకటించటం తన ఫోటోలను కాంగ్రెస్ వాళ్లు వాడుకుంటున్నారని దానిపైన చర్య తీసుకోమని గద్వాల పోలీస్ స్టేషన్లో ఫిబ్రవరి 11న ఎఫ్ఐఆర్ చేయించి నేటి వరకు దాచిపెట్టి విధి లేని పరిస్థితిలో ఉప ఎన్నికల భయంతో నేను బిఆర్ఎస్ లోనే ఉన్నానని ప్రకటించటం ఇంతకంటే రాజకీయ దివాలా కోరుతనం మరొకటి ఉండదు. కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ను చంపడానికి, టిఆర్ఎస్ లోనే ఉన్నారని చెప్పి బీఆర్ఎస్ ని చంపడానికి సిద్ధమైన నీకు రాజకీయ సమాధి కట్టడానికి ప్రజలు సిద్ధమైనారు. ఉప ఎన్నికలు ఎదుర్కోలేని కాంగ్రెస్ పార్టీలో చేరిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో టెక్నికల్ విషయాలను అడ్డం పెట్టుకొని కోర్టు కేసులను, పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తుంగలో తొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు. దమ్ముంటే ఉప ఎన్నికలకు ఎదుర్కోవడానికి సిద్ధం కావాలి. సరితమ్మ ను సమాధి చేయడానికి కాంగ్రెస్లో చేరి, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని ఎత్తుకోవడం మీ రాజకీయ సమాధిని నీవే నిర్మించుకుంటున్నావని గుర్తుపెట్టుకో, ఇకనైనా కుటిల రాజకీయాలను నిచమైన రాజకీయ ఎత్తుగడలను విరమించుకో విలువలు కలిగిన రాజకీయాలు చేయాలి ఊసరవెల్లి తలపించే విధంగా రాజకీయరంగులు మారుస్తూ నాటకాలు ఆడుతున్న ఆటలను కట్టిపెట్టి గద్వాల ప్రజల ప్రాంతా అభివృద్ధి పైన దృష్టి పెట్టు చెరపకురా చెడదవు అన్న నానుడికి నీవు సరిగ్గా సరిపోతావు. నక్కజిత్తులు కుప్పిగంతులు మాని కోతికి కొబ్బరి చిప్ప ఇస్తే చింపి చిందరవందర చేసినట్టు ప్రజలు చీకొట్టేదాకా, చరిత్ర హీనుడుగా నిలబడకు, ఇకనైనా నీచ రాజకీయాలు వదులు ప్రజలను పట్టించుకోండి.




