Tuesday, March 17, 2026

హామీల అమలు విషయంలో కాంగ్రెస్ పార్టీ విధానం సరికాదు

  • అసెంబ్లీ తీర్మానం చేసి చేతులు దులుపుకున్నారు
  • కేంద్రంపై నెట్టి తప్పించుకునే ప్రయత్నం
  • 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలకు పోతే ప్రజాక్షేత్రంలో బుద్ధి చెబుతాం
  • కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలపై త్వరలో “పల్లెబాట”
  • బీసీ ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు కుడికాల భాస్కర్

నేటిసాక్షి/మంగపేట : కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఎన్నికల హామీగా ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాలు సరికాదని, ప్రతి హామీ అమలు విషయంలో మోసం చేస్తూ దగాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందని, చిత్తశుద్ధి లేని వ్యవహారం చేస్తున్న రేవంత్ రెడ్డికి బీసీలు తప్పకుండా బుద్ధి చెబుతారని బీసీ ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు కుడికల భాస్కర్ అన్నారు. ములుగు జిల్లా, మంగపేట మండలంలో జిల్లా అధ్యక్షులు ఉరగొండ మురళీ అధ్యక్షతన జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడుతూ బీసీలకు అడుగడుగున మోసాలు జరుగుతున్నాయని, 18 హామీలు ఇచ్చి నేటికీ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు బడ్జెట్ కేటాయింపులు చేయక కేవలం 9000 కోట్లు మాత్రమే చేసీ మోసం చేశారని, కుల గణన విషయంలో కూడా మోసపూరిత వైఖరితో ఉన్న పరిస్థితుల్లో బీసీ ఆజాది ఫెడరేషన్ తరఫున 12 రోజులు ఆమరణ దీక్ష చేయడం వల్లనే కులగణన జరిగిందని, అసెంబ్లీ తీర్మానం చేసి చేతులు దులుపుకుంటే సరికాదని, 42 శాతం రిజర్వేషన్ తాము అధికారంలోకి వస్తే కేటాయిస్తామన్నారు కానీ కేంద్రంపై నెట్టివేస్తే ఇది ముమ్మాటికి బీసీలను మోసం చేసినట్లు అని, మరి ఆనాడు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చేటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఈ విధానం గుర్తుకు రాలేదా, ఎందుకు బీసీలను మోసం చేసే హామీలు ఇచ్చారని అన్నారు. బీసీలకు జరుగుతున్న మోసాలను తిప్పి కొట్టడానికి, కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికలకు పోతే మాత్రం తగిన బుద్ధి చెబుతామనిహెచ్చరించారు, కాంగ్రెస్ మోసాలపై త్వరలో ” పల్లె బాట” కార్యక్రమం చేపట్టానున్నట్లు తెలిపారు రెడ్ల సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీల అమలు విషయంలో తప్పకుండా నెరవేర్చాలని, మోసం చేసే ప్రక్రియలు కొనసాగిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు, ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల్లో 42 శాతానికి రిజర్వేషన్లు పెంచాల్సిందేనని అయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుడికాల భాస్కర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వ్యాసభట్టు మధుసూదన్ రాజు ఉమ్మడి జిల్లా ఇంచార్జీ జినుకల్ లక్ష్మణరావు వరంగల్ జిల్లా ఇన్చార్జి గజవెల్లి మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News