Monday, March 30, 2026

వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫీజు పోరు పోస్టర్ ఆవిష్కరించిన నియోజకవర్గ ఇన్చార్జి కృపా లక్ష్మి

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైసిపి అధినేత వైస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలమేరకు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం వద్ద ఈ నెల 12 వ తేది బుధవారం జరగనున్న ఫీజు పోరు పోస్టర్ ను గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కృపా లక్ష్మి పుత్తూరు లోని కార్యాలయం సోమవారం లో ఆవిష్కరించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల మాదిరిగానే రాష్ట్రం లోని విద్యార్థులను మోసం చేసిందని కాలేజీలకు సకాలంలో ఫీజురియంబర్స్మెంట్ సొమ్ము చెల్లించకపోవడంతో యాజమాన్యలు విద్యార్థులను కాలేజీ లనుండి వెళ్లగొడుతున్నాయని ఈ ప్రభుత్వం పేదపిల్లల జీవితాలుతో ఆటలు ఆడుతుందని దీనికి నిరసనగా ఈ నెల 12 వ తేది బుధవారం ఉదయం 10:00 గంటలకు చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతూ వినతిపత్రం అందజేయనున్నామని కావున జీడి నెల్లూరు నియోజకవర్గం నుండి విద్యార్థులు, యువకులు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్దఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం లో వైసిపి పార్టీ నియోజకవర్గ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News