- శ్రీకారం చుట్టిన మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్య
- డి.సి.ఎం.ఎస్. సంస్థ, వ్యాపారస్తుల హర్షం

నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ పట్టణంలోని డీసీఎంఎస్ కాంప్లెక్స్ లో గురువారం రోజున నూతన డ్రైనేజీ నిర్మాణ ప్రారంభోత్సవం జరిగింది. డీసీఎంఎస్ సంస్థ కాంప్లెక్స్ నిర్మాణం చేసి 25 ఏళ్లు పూర్తి కావస్తోంది. డీసీఎంఎస్ కాంప్లెక్స్ లో డ్రైనేజీ వ్యవస్థ ఇరుకుగా ఉండడం వలన ఎన్నో సమస్య లు చాలా తలెత్తాయి. ఈ డ్రైనేజీ నిండిన కారణంగా వ్యాపారస్తుల షట్టర్లలోనికి నీరు చేరడం, చినుకు పాటి వర్షానికి కూడా ఈ డ్రైనేజీ నిండడం వలన మురుగునీరు రోడ్లపైకి చేరి అస్తవ్యస్తంగా మారేది. ఈ కారణంగా డీసీఎంఎస్ సంస్థ మరియు వ్యాపారస్తులు ఇబ్బందులకు గురయ్యారు. ఎన్నోసార్లు డ్రైనేజీ వ్యవస్థను పునర్ నిర్మించాలని అధికారులకు వినతి పత్రాలు అందించినా ఫలితం లేకపోయింది. ఈ డ్రైనేజీ క్లియర్ చేయడానికి మున్సిపల్ సిబ్బంది మూడు నాలుగు ఫీట్ల లోతులో ఇరుక్కున్న చెత్త చెదారాన్ని తీసేయడానికి నానాతంటాలు పడ్డారు. ఎంతమంది అధికారులు వచ్చినా కూడా ఈ సమస్యను పట్టించుకోలేదు. ఎట్టకేలకు నేటి సాక్షి చొరవతో నూతనంగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా డిసిఎంఎస్ కాంప్లెక్స్ లోని వ్యాపారస్తులు నేటి సాక్షి ప్రతినిధి రాఘవుల శ్రీనివాసు, గంగిశెట్టి ప్రభాకర్, విజయ్ కుమార్ మున్సిపల్ కమిషనర్ కు, బల్దియా చైర్ పర్సన్ గందె రాధిక లకు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్, తోట రాజేంద్ర ప్రసాద్, కమలాకర్, ముత్యం రాజు, తిరుమల్ రెడ్డి, శంతన్ రెడ్డి, జవాన్ ప్రతాప రాజు తదితరులు పాల్గొన్నారు.





