Thursday, March 12, 2026

అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్ నిర్మాణాలు వెంటనే ఆపాలి

  • అనుమతులను కూటమి ప్రభుత్వం రద్దు చేయాలి
  • స్పంచికపోతే , తిరుపతిలో మరో హిందూ శంఖారావానికి పిలుపునిస్తాం
  • స్వామీజీలు ,హిందూ సంఘాలు స్పష్టం

నేటి సాక్షి, (బాదూరు బాల) తిరుపతి: తిరుపతి పరిపాలనా భవనం ముందు శనివారం స్వామీజీలు, హిందూ సంఘాలతో కలిసి అలిపిరి వద్ద అక్రమ కట్టడాలను వెంటనే నిలిపివేయాలని, అనుమతులు రద్దు చేయాలని, తిరుమల పవిత్రతను కాపాడాలని తిరు క్షేత్రాల రక్షణ సమితి తుమ్మ ఓంకార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి ఫోటోలతో అన్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ, గత, ప్రస్తుత జీవో లను మీడియాకు చూపుతూ గోవిందా గోవింద నామా స్మరణలు చేశారు. అనంతరం టిటిడి ఈవో శ్యామలా రావు కు వినతి పత్రం ఇచ్చి తిరుమల పవిత్రతను కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీ శ్రీ శ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ తిరుమల ప్రపంచ పవిత్ర దివ్య క్షేత్రం అలాంటి స్వామి వారి చెంత అలిపిరిలో నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్ టిటిడి నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని, గత ప్రభుత్వంలో అనుమతులను టిటిడి చైర్మన్, కూటమి ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు చేయడం, ముఖ్యమంత్రి తిరుమల ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హిందూ బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పడంతో ఎంతో సంతోషించాము.కానీ ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం కూడా నిర్మాణాలు జరుతున్నా ఎందుకు టిటిడి గాని, ముఖ్యమంత్రి చంద్రబాబు గాని, పవన్ కళ్యాణ్ గాని స్పందించడం లేదు, దీనిపై మాకు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అన్నమయ్య సినిమా తీసే సమయంలో తిరుమల, తిరుపతి పరిసరాలు మొత్తం స్వామి వారి పవిత్రతకు, టీటీడీకి సంబంధించిందే కానీ,ప్రభుత్వాలు కూడా ఇందులో జోక్యం చేసుకోకూడదని అన్న జీవోలు చూపిస్తూ, స్పష్టం చేశారు. అదే విధంగా గతంలో ఓ మాజీ ముఖ్యమంత్రి ఏడు కొండల జోలికి వెళ్ళి అదృశ్యం అయ్యారని, ఆపుడు కూడా మరో జీవో కోర్టు ద్వారా ఇచ్చిందని, స్వామి వారితో పెట్టుకుంటే నామరూపాలు ఉండవని ఎన్నో సార్లు నిర్దారణ అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హై కోర్టు కనుక వెంటనే నిర్మాణాలు నిలిపివేయాలని, లేని పక్షంలో త్వరంలో తిరుపతిలో మరో హిందూ శంఖారావం పిలుపు నిస్తామనీ,కుంభ మేళా నుంచి ఉప్పెనలా వచ్చేందుకు స్వామీజీలు, హిందువులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీ శ్రీ శ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వామి, శివానంద స్వామి, గణేష్ స్వామి, తిరు క్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షులు తుమ్మ ఓంకార్, మరియు హిందూ ఉపాద్యాయ సమితి జాతీయ అధ్యక్షులు మహేష్ డేగల, హిందూ నాయకులు కిరణ్ కుమార్, హిందూ విలేకరుల సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మునిరామ్ రెడ్డి, నీలకంఠ, గోకుల్ తదితర ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రల స్వామీజీలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News