నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన మైస సమ్మయ్య (47) భవన నిర్మాణ మేస్త్రి గుండెపోటుతో బుదవారం రాత్రి అకాల మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. గత 20 సంవత్సరాలుగా భవన నిర్మాణ మేస్త్రిగా పనిచేస్తూ అందరి మన్నలు పొందారు. కాట్రపల్లి ఎస్సీ కాలనీ నుంచి తీన్మార్ వాయిద్యాలతో బాణా సంచాలతో ఊరు స్మశాన వాటిక వరకు ర్యాలీతో వీడ్కోలు తెలిపి అంత్యక్రియలు నిర్వహించారు. సమ్మయ్య అకాల మృతి పట్ల తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఎర్ర కుమార్ హాజరై ప్రఘాడ సంతాపం తెలిపి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ఓదార్చారు.

