Friday, March 20, 2026

పోస్ట్ ఆఫీస్ చట్టం 2023 వెనక్కి తీసుకునేంతవరకు నిరంతర పోరాటం

నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి.(రాఘవుల శ్రీనివాసు):
పోస్టల్ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయం మేరకు ఈరోజు హుజురాబాద్ ప్రధాన తపాల కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా అఖిలభారత తపాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యు మహేందర్ మాట్లాడుతూ తపాల శాఖలో ప్రవేశపెడుతున్న నూతన సంస్కరణల వల్ల తపాల వ్యవస్థ నిర్వీర్యం కాబోతుందని ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. పోస్ట్ ఆఫీస్ చట్టం 2023 ప్రకారం తపాల శాఖలో తీసుకుంటున్న నూతన సంస్కరణల ద్వారా ప్రవేశపెడుతున్న ఇంటిగ్రేటెడ్ డెలివరీ సెంటర్ ల ద్వారా పోస్ట్ మెన్ స్టాఫ్ తగ్గిపోతుందని మెకానైజ్డ్ డెలివరీ సిస్టం ద్వారా పోస్ట్ మెన్ ఉద్యోగులకు భద్రత లేనటువంటి విధానాన్ని ప్రవేశపెట్టి రోడ్డు మైలేజీ కిలోమీటర్ కు 98 పైసలు చెల్లించి వారిని తీవ్ర ఒత్తిడికి గురిచేయడాన్ని ఖండిస్తున్నామని, ఈమధ్య ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పెన్షన్ సిస్టంను వ్యతిరేకిస్తున్నామని ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ చేసేంతవరకు ఉద్యోగుల పోరాటం నిరంతరమని, ఎనిమిదవ వేతన కమిటీ ద్వారా ఉద్యోగులకు క్యాడర్ చేసి గ్రేడ్ పే పెంచాలని, నిత్యావసరాల ధరలను దృష్టిలో పెట్టుకొని కనీస వేతనాన్ని 18,000/- నుండి 45,000/- రూపాయలకు పెంచాలని ఎనిమిదవ వేతన కమిటీలో గ్రామీణ డాక్ సేవకులను తీసుకొని వారికి సివిల్ సర్వెంట్ హోదాను కల్పించి పెన్షన్, మెడికల్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ ఖాతాలకు సంబంధించి ఏటీఎం కార్డ్స్ ను ఐపిపిబి కి తరలించడానికి వ్యతిరేకిస్తున్నామని ఈ మధ్యకాలంలో చేపట్టినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ రివ్యూ ద్వారా తపాలా శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల పైన తీవ్ర ఒత్తిడి నెలకొందని ఇలాంటి వ్యతిరేకమైనటువంటి మార్పుల ద్వారా డిపార్ట్మెంట్ కు తీవ్ర నష్టం చేకూరుతుందనీ తెలుపుతూ, ఈ వ్యతిరేక విధానాల ప్రశ్నించేటువంటి సంఘాలను గుర్తింపు రద్దు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తు, రాంచి హైకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోస్టల్ జాయింట్ కౌన్సిల్ ఆఫ్ యాక్షన్ నాయకులు కామ్రేడ్ పి రవికుమార్, జై రజనీకాంత్, తిరుపతి నాయక్, ఏ అనిల్ కుమార్, రాజమౌళి, ప్రవీణ్, చంద్రమోహన్, వేణు, సందీప్, శ్రీనివాస్, సమ్మురాజు, మీస తిరుమలేష్, ఎండి రఫీ, హరీష్ అనిల్, గౌరవ్, స్వామి, సతీష్, ఎర్ర రాజు, అపూర్వ, శివాజీ, రాజేష్, సాయి, సత్యం రాము తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News