నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రజా సేవకుడు, నిరంతర శ్రామికుడు, విశ్రాంత ఐపిఎస్ అధికారి, వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు జన్మదినాన్ని పురస్కరించుకుని 55 వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రజిత వెంకటేశ్వర్లు(శ్రీను) యాదవ్ ఆధ్వర్యంలో పలివేల్పుల లోని లార్డు వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ వృద్దులు ఎమ్మెల్యే నాగరాజు కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఎమ్మెల్యే నిండు నూరేళ్ళు, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని దీవించారు. ఈ కార్యక్రమంలో 55వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగాల ప్రేమ్ కుమార్, భీమారం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మార్క రాజు, డివిజన్ కార్యదర్శి సంగాల పరమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంగాల చిట్టి బాబు, పెండ్యాల వీనస్, మిల్క్ ప్రకాష్, యూత్ కాంగ్రెస్ నాయకులు అల్లం సన్నీ, కొడారి మహేష్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు సంగాల అశోక్, రవి, సత్యం తదితరులు పాల్గొన్నారు.




