
నేటి సాక్షి, ఎండపల్లి(రియాజ్): సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న మండలంలోని కొత్తపేట శాతవాహన జిన్నింగ్ ప్రెసింగ్ కాటన్ మిల్ నందు పత్తి కొనుగోళ్లు శుక్రవారం పునఃప్రారంభం కానున్నట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు పత్రిక ప్రకటన ద్వారా వెల్లడించారు. గత పది రోజులుగా సాంకేతిక కారణాల వల్ల పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసినదే. అయితే పత్తి రైతుల ఆందోళన, ప్రజా ప్రతినిధులు, ఆధికారుల కృషితో ఎట్టకేలకు తిరిగి పునఃప్రారంభం కానుండటంతో రైతుల పడిగాపులకు ఊపిరి పోసినట్లైయింది. కాగా ఈ కొనుగోళ్లను నేటి నుండి యాదావిధిగా జరుపబడుతాయని, రైతులందరు గమనించి పత్తిని దళారులకు అమ్మి నష్టపోకుండా సీసీఐ ఏర్పాటు చేసిన మిల్ నందు అమ్మకం జరిపి, తేమ శాతం ఆధారంగా ప్రభుత్వ నిర్ణయించిన మద్ధతు ధరను పొందాలని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గుండాటి గోపిక-జితేందర్ రెడ్డి, ఆధికారులు రైతులకు తెలిపారు.





