- వారికి తక్షణ సహాయం చేసిన ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు కోవ లక్ష్మి
నేటి సాక్షి, కొమురం భీం : ఆసిఫాబాద్ జిల్లా కొత్త రహపల్లి గ్రామంలో ఈ రోజు షర్ట్ సర్క్యూట్ వల్ల మూడు ఇల్లు దగ్ధం జరగడం తో విషయం తెలుసుకొని వారి కుటుంబాలను పరామర్శించి, వారికి తక్షణ ఆర్థిక సహాయం మూడి సరుకులు అందించిన ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు కోవ లక్ష్మి, అనంతరం వారికి ప్రభుత్వ సహాయం కొరకు స్థానికి ఏం ఆర్ ఓ గారికి సూచించారు. వారి కుటుంబానికి ఎల్లవేళల అండగా ఉంటానని వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ సింగిల్ విండో ఛైర్మెన్ అలీ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





