
నేటిసాక్షిబ్యూరో, నిజామాబాద్, టి.ఎన్ రమేష్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రం రెక్కపల్లి గ్రామంలో బడిబాట పిల్లల సర్వేలో భాగంగా విద్యార్థి చిన్ని గారి విష్ణు ను గుర్తించిన సి ఆర్ పి రాజు విద్యార్థి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి విద్య యొక్క ప్రాముఖ్యతను వారికి తెలియజేశారు. బడి బయట విద్యార్థి విష్ణును బుధవారం రోజు ఎంపీయూపీఎస్ సజ్జనపల్లి పాఠశాలలో 8వ తరగతిలో చేర్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సిఆర్పి రాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయన్న, ఉపాధ్యాయులు రవి, ప్రతిమ, మమత, రాజు, సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.





