- మాజీ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్

నేటి సాక్షి, బెజ్జంకి: బెజ్జంకి మండలంలోని బేగంపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ యూత్ నాయకులు కొరివి తిరుపతి కుమార్తెకు గాయాలవగా అదే గ్రామానికి చెందిన బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మామిడి లక్ష్మణ్ అనారోగ్యంతో భాదపడుతుండగా, కల్లెపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు మామిడ్ల తిరుపతి కి అక్సిడెంట్ అవ్వగా వారిని పరామర్శించి, గుండారం గ్రామానికి చెందిన పరకాల లక్ష్మీ నర్సయ్య, గైని వజ్రవ్వలు ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన మానకొండూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్. వీరి వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు లింగాల లక్ష్మణ్, కనగండ్ల తిరుపతి, మాజీ ఏఎంసి చైర్మన్ కచ్చు రాజయ్య,మాజీ సర్పంచ్ ల ఫోరమ్ మండల అధ్యక్షులు చింతలపల్లి సంజీవరెడ్డి,మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ ముక్కిస తిరుపతి రెడ్డి, రిటైర్డ్ ఉపాధ్యాయులు చెలుకల తిరుపతి రెడ్డి, సోషల్ మీడియా ఇంచార్జి ఎలా శేఖర్ బాబు, నాయకులు రామలింగారెడ్డి, కత్తి అంజయ్య, కత్తి రాములు, తాల్లపెళ్లి నరేష్ గౌడ్, బీఆర్ఎస్వి నియోజకవర్గ ఉపాధ్యక్షులు బిగుల్ల దుర్గ సుదర్శన్, మాంకాల రాజు, తాల్లపెల్లి చిన్న శ్రీనివాస్, చిన్న రాజయ్య,ఉత్కం రాములు, పరకాల మహేష్ తదితరులు కలరు.





