- కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తిరుపతయ్య
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : హైదరాబాద్ నగరంలోని గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ మంత్రి దామోదర్ రాజ నరసింహ ని జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ భర్త తిరుపతయ్య మర్యాద పూర్వకంగా కలిసి, గద్వాల నియోజకవర్గ పలు అభివృద్ధి పథకాలకు, గ్రామాలకు రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించాలని వినతిపత్రం అందజేసినారు. అలాగే గద్వాల నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు కొంతమంది వ్యక్తుల ప్రమేయంతో ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుందని అట్టి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.



