- త్యాగాల చరిత్ర, పోరాటాల చరిత్ర ఎర్రజెండాది
నేటి సాక్షి, బెజ్జంకి: భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) 100వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బెజ్జంకి మండల కేంద్రంలోనీ అంబేద్కర్ కూడలి వద్ద సిపిఐ మండల కార్యదర్శి బోనగిరి రూపేష్ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పోతిరెడ్డి వెంకట్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి వారు మాట్లాడుతూ పార్టీ 100 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఈనెల 30వ తేదీన నల్లగొండ జిల్లాలో జరిగే పార్టీ ఆవిర్భావ ప్రారంభోత్సవ బహిరంగ సభ ర్యాలీని జయప్రదం చేయాలని, త్యాగాల చరిత్ర పోరాటాల చరిత్ర కలిగిన సిపిఐ పార్టీ జెండా పట్టుకొని నిరంతరం పేద ప్రజల పక్షాన పోరాడతామని, బడుగు బలహీన వర్గాల కోసం అనునిత్యం పోరాడేది కేవలం సిపిఐ జెండా మాత్రమేనని అట్లాంటి ఎర్రజెండా వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అందులో అనేక త్యాగదనులతో నిండిన వారసత్వాన్ని పోరాటాన్ని పునికిపుచ్చుకొని ముందుకు నడవాలని ఓట్లు సీట్లు ఎత్తుల చిత్తుల ప్రలోభాలకు లొంగకుండా రాగద్వేషాలకు అతీతంగా కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా పోరాడేది పోరాడుతున్నది కేవలం సిపిఐ మాత్రమేనని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు బోయినపల్లి అశోక్ రావు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సంఘం మధు, ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి దొంతర వేణి మహేష్, బోనగిరి శ్రావణ్, సంపత్, రోడ్డ చరణ్, కల్లూరి బాలమల్లు, బోనగిరి అర్జున్, బోనగిరి గుండయ్య, తదితరులు పాల్గొన్నారు.

