- త్యాగాల ఘనత, పోరాటాల చరిత్ర ఎర్రజెండాది..
- జిల్లా కార్యవర్గ సభ్యులుబత్తుల బాబు
నేటిసాక్షి, సైదాపూర్:
భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)100వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం రోజున గుండ్లపల్లి గ్రామంలో సిపిఐ జెండాను లంకదాసరి కళ్యాణ్ అద్వర్యంలో జిల్లా కార్యవర్గ సభ్యులు బత్తుల బాబు ఆవిష్కరించి పార్టీ నాయకులతో కలిసి గుండ్లపల్లి గ్రామంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. అనంతరం సీనియర్ కమ్యూనిస్టు నాయకులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు బత్తుల బాబు మాట్లాడుతూ సిపిఐ పార్టీ 100 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, త్యాగాల ఘనత పోరాటాల చరిత్ర కలిగిన సిపిఐ పార్టీ జెండా పట్టుకొని నిరంతరం పేద ప్రజల పక్షాన పోరాడుతామని అన్నారు. ఈ భారత దేశంలో మెట్టమెదటి సారిగా పుట్టిన ఎకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ దున్నెవాడికే భూమి కావాలని ప్రతి మనిషి ఈ దేశంలో నివసించేందుకు కుడూ గుడు గుడ్డ కావాలని ప్రజాపోరాటాలు చేసిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని అయన అన్నారు. ఎన్నో సమరశీలపోరాటాలకు నాంది పలికి బానిసత్వం, పెట్టుబడిదారి దోపిడీ వ్యవస్థ నుండి విముక్తి కలిగించిన పార్టీ అని అయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ లంకదాసరి కళ్యాణ్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంది రవిందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు దొనికన అనిల్, మండల నాయకులు ఒజ్జ కొంరయ్య, జడల రాజేషం, ఒడ్నాల వెంకటేష్, పుట్ట సంపత్, బాషవేణి శ్రీనివాస్, నలువాల రవి, కొమ్ముల సమ్మయ్య, బాషవేణి ఒదెలు, కదిరి తిరుపతి, ముష్కె రవి,రాజు, సురేష్,సురేష్, ఒదెలు తదితరులు పాల్గొన్నారు.