- – టోర్నమెంటుకు టీ షర్ట్ లు స్పాన్సర్ చేసిన డా.సతీష్
నేటిసాక్షి, ఓదెల :
ఓదెల మండల కేంద్రంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ లో ఓదెల గ్రామం నుండి నాలుగు జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నా జట్లకు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ మాజీ డైరెక్టర్ డా. కనికిరెడ్డి సతీష్ శుభాకాంక్షలు తెలియజేస్తూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి, ఆరోగ్యం, యోగ క్రీడలు, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ పై దృష్టి పెట్టాలని, క్రీడా స్పూర్తితో ఆటలు ఆడాలని సూచించారు. అనంతరం ఓదెల గ్రామం నుండి పాల్గొనే అన్ని జట్లకు టీ షర్ట్ లను స్పాన్సర్ చేశారు. ఫ్రెండ్స్ యూత్ టోర్నమెంట్ నిర్వాహకులు చరణ్, ఇమ్రాన్, అజీజ్ టోర్నమెంటుకు అన్ని రకాల ఏర్పాట్లు నిర్వహించినట్లు తెలిపారు. ఈ టోర్నమెంటుకు టీ షర్ట్ లు స్పాన్సర్ చేసిన డా. సతీష్ కి ఓదెల గ్రామ యూత్ ప్రత్యేక అభినందలు తెలియజేశారు.

