నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
యాసంగి వరి సాగు రైతులు నారుమడిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ విస్తరణాధికారి పొద్దుటూరి సతీష్ రెడ్డి తెలిపారు. సిర్సపల్లిలో అంబాల ప్రభాకర్ రైతు నారుమడిలో సలహాలు సూచనలు తెలిపారు. వరి నారు దశలో తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయని, నారు దశలో చలి సమస్య అధిగమించడానికి రాత్రి వేళల్లో నీరు తీసి, ఉదయాన్నే కొత్త నీరు పెట్టాలని అన్నారు. చలి సమస్య ఉన్న ప్రాంతాల్లో 500 మీటర్ల చదరపు వరి నారుమడిలో 10 కిలోల భాస్వరం ఎరువులను రెట్టింపుగా వేయాలి. ప్రస్తుతం చలి వల్ల నారు మళ్ళల్లో జింక్ దాతు లభ్యత తగ్గి జింకు లోప లక్షణాలు గమనించమని దీని నివారణకు 2 గ్రాముల జింక్ సల్పేట్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. ఒకే వరి పంట పండించే పొలాల్లో రైతులు ప్రతి యాసంగిలో జింక్ సల్పేట్ ని ఎకరాకి 20 కిలోలు ప్రధాన మడిలో ఆఖరి దమ్ములో తప్పక వేయాలన్నారు. కాండం తొలుచు రెక్కల పురుగులు ఎక్కువగా నారుమడిలో ఎగురుతూ కనబడుతుంటాయని పసుపు గోధుమ వర్ణంలో ఉన్న రెక్కల పురుగులు ఆకు కోసలపై ఉదయపు వేళలో కనబడును. గుడ్ల సముదాయం ఆకులపైన, కాండముపైన కనబడును. గుడ్ల నుండి వచ్చిన పురుగులు కాండములోనికి ప్రవేశించి గుజ్జుని తినటం వలన మెవ్వులు ఎండిపోతుంది. ఎండిన మెవ్వులు సులువుగా ఉడివస్తాయి. పూత దశలో ఈ పురుగు ఆశించిన యెడల కంకి మొత్తం తెల్లగా అయిపోవును. నారుమడిలో ఈ రెక్కల పురుగుల నివారణకు వేపకషాయం నూనెను వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. నారు పికడానికి 5 రోజుల ముందు ఒక ఎకరాకు సరిపడే నారుమడిలో కార్భో ఫ్యూరాన్ 3జి గుళికలు ఒక కిలో చల్లితే 25 నుండి 30 రోజుల వరకు ప్రధాన మడిలో పురుగులను నివారించవచ్చని తెలిపారు. అయన వెంట వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ తునికి రవి, రైతులు ఉన్నారు