నేటిసాక్షి బ్యూరో, నిజామాబాద్ టి.ఏన్ రమేష్ : కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండల కేంద్రానికి చెందిన, పాల వ్యాపారి నారాయణరావుకు గుర్తుతెలియని ఫోన్ నెంబర్ నుంచి ఆర్మీ అధికారులము, పాలు కావాలంటూ నమ్మించిన సైబర్ కేటుగాళ్లు. మండల కేంద్రంలోని గురుకుల ఏకలవ్య పాఠశాలలో శిక్షణ కొరకు రెండు నెలల కొరకు, వచ్చాము అంటూ నమ్మించిన సైబర్ కేటుగాళ్లు. పాల కోసం కొంత అడ్వాన్స్ చెల్లిస్తామంటూ నమ్మించి, బ్యాంకు అకౌంట్ పంపాలంటూ సూచించిన సైబర్ కేటుగాళ్లు. దీంతో అవతలి వ్యక్తుల మాటలు నమ్మి, బ్యాంకు వివరాలు పంపిన బాధితుడు. ఓటీపీని పంపిన వెంటనే, సైబర్ కేటుగాళ్లు. దీంతో ఓటీపీని ఓపెన్ చేయగానే విడతల వారీగా కలిపి 2.82 లక్షలు డెబిట్ అయినట్లుగా ఫోన్ కు మెస్సేజ్ వచ్చింది. షాక్కు గురైన బాధితుడు, వెంటనే చేరుకొని తాను, మోసపోయానని గ్రహించినడు. బాధితుడు నారాయణరావు, 1930 నంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు. అనంతరం స్థానిక గాంధారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు, బాధితుడు నారాయణరావు తెలిపాడు. ఇందుకు సంబంధించిన కేసును నమోదు చేసుకొని, సైబర్ క్రైమ్ పోలీసులకు స్థానిక గాంధారి పోలీసులు సమాచారం అందించి, దర్యాప్తు చేస్తున్నట్లు విశ్వాసనీయంగా తెలిసింది.





