- నూతన డ్రైనేజీ నిర్మాణానికి అనుమతులు
- మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్య
నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్. సి. (రాఘవుల శ్రీనివాసు):




హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోగల డిసిఎంఎస్ కాంప్లెక్స్ లీక్ డ్రైనేజీ సమస్య ఇబ్బంది పెడుతున్న విషయం విధితమే. చాలా సంవత్సరాలుగా డ్రైనేజీ ఎప్పుడు జామ్ అవడం తో మురుగు నీరంతా రోడ్డుపై ప్రవహించి తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఎన్ని సార్లు క్లిన్ చేసిన ప్లాస్టిక్ తో మళ్ళి జాం కావడంతో మున్సిపల్ సిబ్బంది దాన్ని తొలగించడానికి నానా తంటాలు పడాల్సి వచ్చేది. మున్సిపల్ పరిధిలో గల అన్ని వార్డులలో డ్రైనేజీలు పూర్తి అయినప్పటికీ డీసీఎంఎస్ కాంప్లెక్స్ లో మాత్రం ఈ డ్రైనేజీని ఎవరు పట్టించుకో లేదు. ఎన్నోసార్లు డిసిఎంఎస్ అధికారులు, వ్యాపారస్తులు మున్సిపల్ అధికారుల, పాలకుల దృష్టికి తీసుకెళ్లేనా స్పందించలేదు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ కే సమ్మయ్య పరిశీలించి ఎట్టకేలకు డ్రైనేజీ వ్యవస్థను నిర్మించాలని ఆదేశించారు.



