Thursday, April 2, 2026

ప్రణవ్ ను కలిసిన దళితబంధు లబ్ధిదారులు

నేటి సాక్షి, హుజూరాబాద్ ఆర్. సి (రాఘవుల శ్రీనివాసు):
దళిత బంధు రెండవ విడత నిధులు రావడానికి కృషి చేసిన హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కు కృతజ్ఞతలు తెలిపారు దళితబంధు లబ్ధిదారులు. సోమవారం నాడు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి ఆంక్షలు లేకుండా సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో మాట్లాడి నిధుల విడుదలకు కృషి చేశామని గతంలో జరిగిన అవకతవకలకు ఎలాంటి అవకాశం లేకుండా పకడ్బందీగా అమలు చేస్తున్నామని, దళారి వ్యవస్థకు అవకాశం లేకుండా అమలు చేస్తున్నామని, దీనిపై ఇప్పటికే సంబధిత అధికారులకు సూచనలు చేశామని తెలిపారు. దీంట్లో భాగంగా డైరీఫార్మ్ యూనిట్ లబ్దిదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News