- దళిత బంధు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కోగిల మహేష్

నేటిసాక్షి/మంగపేట : మంగపేట మండల కేంద్రంలో బి అర్ అంబేద్కర్ భవన్ లో దళిత బందు సాధన సమితి మండల అధ్యక్షులు బియ్యం శ్రీను అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర దళిత బందు సాధన సమితి అధ్యక్షులు కోకిల మహేష్ హాజరై దళిత బందు లబ్దిదారుల ఆత్మ గౌరవ సభ పోస్టర్ ను ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా దళితుల అభివృద్ధి మీద చిత్తశుద్ధి ప్రేమ ఉంటే త్వరలో జరుగబోయే తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో రెండవ దళిత బంధు పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన లబ్ధిదారుల ఖాతాలో నిధులు జమ చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కచ్చితంగా రెండో విడత దళిత బంధు నిధులను విడుదల చేసే విధంగా నూతన సంవత్సరంలో కార్యాచరణను తీసుకోవడానికి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలను ప్రజా సంఘాలను దళిత సంఘాలను ఆహ్వానించి దళిత ఐక్యతను ఆకాంక్షను దళితుల ఆవేదనను తెలిసె విధంగా కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తామని తెలిపారు స్థానిక శాసన సభ్యురాలు మంత్రి సీతక్క స్పందించి దళిత బంధు లబ్ధిదారుల అకౌంట్లో దళిత బంధు నిధులు జమ చేసే విధంగా చొరవ చూపాలని కోరారు రెండో విడత దళిత బందు నిధులు జమ చేయని యెడల సరికొత్త పంతాలో కార్యక్రమాలు రూపొందించి దళితులకు న్యాయం చేసే వరకు పోరాడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సలహాదారు దర్శనాల సంజీవ్ జిల్లా అధ్యక్షులు కర్రి శ్యాంబాబు డివిజన్ ఇంచార్జి కాళ్ళ రామకృష్ణ ఎలగందుల మొగిలి జానపట్ల జయరాజ్ కోలుకుల దేవేందర్ గంధం కిషోర్ మూగల రాము కూకట్ల శీను పూసల నరసింహారావు మంచాల నాగేంద్రబాబు మోదుగు బాబు దుర్గం ఏకాంతం బిసు సాంబయ్య నైనారపు కేశవులు నాగుల సతీష్ పాల్గొన్నారు.

