నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : సోమవారం సాయంత్రం గద్వాల పట్టణంలోని దౌదరర్ పల్లి (7వ వార్డు) ఐజ రోడ్డు లోని రైల్వే బ్రిడ్జి దగ్గర రిక్వెస్ట్ బస్ స్టాప్ ని మాజీ కౌన్సిలర్ దౌలుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ పాతిక రిక్వెస్ట్ బస్ స్టాప్ రిక్వెస్ట్ బోర్డును ఆవిష్కరించి అనంతరం బస్ స్టాప్ కి వచ్చిన బస్ డ్రైవర్ కండెక్టర్ లకు పుష్ప గుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ రిక్వెస్ట్ బస్ స్టాప్ వల్ల గద్వాల మున్సిపాలిటీలోని 7వ వార్డు (దౌదర్ పల్లి), సాయి హోమ్స్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ పిల్లిగుండ్ల కాలనీ లకు చెందిన పట్టణ ప్రజలు ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవడానికి వీలవుతుంది ఈ సందర్భంగా ఆయా కాలనీల ప్రజలు ఆర్టీసీ డిపో మేనేజర్ సీహెచ్ మురళి కృష్ణ, మాజీ కౌన్సిలర్ విష్ణు ప్రియ దౌలుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆయా కాలనీలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు.





