నేటి సాక్షి, జమ్మికుంట
కూతురు మతాంతర వివాహం చేసుకున్నందుకు మనస్థాపానికి గురై తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జమ్మికుంట పట్టణం లో ఆదివారం చోటుచేసుకుంది. జమ్మికుంట సిఐ రవి తెలిపిన ప్రకారం జమ్మికుంట పట్టణ శాలవాడకు చెందిన చెందిన ఎండి కలీం (45) కూతురు జనవరి 2 గురువారం రోజున ఇంటి నుండి వెళ్లిపోయి మతాంతర వివాహం చేసుకున్నందుకు మనస్థాపానికి గురై శనివారం తెల్లవారుజామున పురుగుల మందు తాగాడు. చికిత్స కోసం ఎంజీఎంకు తీసుకువెళ్లగా ఆదివారం రాత్రి చికిత్స పొందుతూ మరణించాడు అని మృతుడి భార్య ఎండి సహేదా సుల్తానా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

