- గృహ సామాగ్రిని దొంగిలించిన ఇద్దరు మహిళలు
నేటి సాక్షి, కమలాపూర్:
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్ గ్రామంలో గురువారం రోజున పట్టపగలు గృహ సామాగ్రిని మరియు విలువైన వస్తువులను దొంగిలించారు. వివరాల్లోకి వెళితే ఉప్పల్ గ్రామానికి చెందిన పోతురాజు కుమార స్వామి ఇంట్లో ఎవరూ లేని సమయంలో సుమారు 20 వేల రూపాయల విలువగల ఇత్తడి వస్తువులు, ఫ్యాన్లు మరియు ఇతర గృహా సామాగ్రిని దొంగిలించారనే ఫిర్యాదు మేరకు శుక్రవారం రోజున కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలానికి చెందిన దుగ్యాల శాంత మరియు ఉండ్రాది జ్యోతి అను ఇద్దరు మహిళలను దొంగలుగా గుర్తించి వారిని అరెస్టు చేయడం జరిగిందని సీఐ హరికృష్ణ తెలిపారు. అంతేకాకుండా గ్రామంలోని వీధులలో అనుమానాస్పదంగా ఎవరు తిరుగుతున్న పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని మండల ప్రజలకు సూచనలు చేశారు.