- ప్రాణహిత నదిలో మునిగి యువకుడు మృతి


నేటి సాక్షి, వేమనపల్లి : హోలీ పండుగ రోజున ఊహించన విషాదం చోటుచేసుకుంది. అప్పటివరకు స్నేహితులతో కలిసి ఎంతో సంతోషంగా రంగులు చల్లుకుంటూ, సెల్పీలు తీసుకుంటూ వేడుకలు జరుపుకున్న అయిదుగురు యువకులు కంపెల నవీన్, గుమ్మెల సాయి కృష్ణ, బక్కిరాకేష్, చింతల అభిరామ్, కంపెల రాజ్ కుమార్ కలిసి స్నానం చేసేందుకు వెళ్లి ప్రాణహిత నది పేట రేవు వైపు స్నానానికి వెళ్లి కంపెల రాజ్ కుమార్ (19) నీటిలో మునిగి ఈత రాకపోవడంతో గల్లంతయ్యాడు. దీంతో యువకులు గ్రామస్థులకు స్థానిక పోలీస్ స్టేషన్ సమాచారం అందించారు. సంఘటన స్థలానికి ఎస్సై శ్యామ్ పటేల్ చేరుకొని గజ ఈతగాళ్లతో గాలించగా మృతి దేహం లభ్యమైంది. మృతుడికి తండ్రి కొన్ని సంవత్సరాల క్రితం చనిపోగా తల్లి లక్ష్మి ఒక్కతే కష్టపడి చదివిస్తుంది. కాలేజీ నుండి హోలికి ఇంటికి వచ్చి ఇలా చనిపోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మృతి దాహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తదుపరి చర్యల నిమిత్తం దర్యాప్తు చేపడుతున్నామని అన్నారు.





