Tuesday, March 17, 2026

వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డిప్యూటీ డి.ఎం.హెచ్.ఒ. తనిఖీ

నేటిసాక్షి/వాజేడు : ములుగు జిల్లా వాజేడు మండలంలో జిల్లా కలెక్టర్ జిల్లా వైద్య శాఖ అధికారి ఐటిడిఏ పిఒ ఆదేశాల మేరకు డిప్యూటీ డి.ఏం.హెచ్.ఒ. కోరం క్రాంతి కుమార్
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేయడం జరిగింది. వైద్యాధికారికి విధులకు సమయపాలన పాటించాలని ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని తప్పనిసరిగా ఆరోగ్య కేంద్రంలో వైద్య అధికారి అందుబాటులో ఉండాలని రెండు రోజుల క్రితం మీడియా కథనాలపై జిల్లా అధికారులు ఆరా తీయగా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని వైద్యాధికారి కి వైద్య సిబ్బందికి డిప్యూటీ డిఎం హెచ్ ఓ ఆదేశించడం జరిగింది. వైద్యశాలలో కాన్పు అయినా తల్లి. బిడ్డ వారికి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైద్యశాలలో సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించి నెలసరి ఆశాడే సమావేశంలో సమావేశమై గ్రామాలలో ఆశా కార్యకర్తలు గ్రామాలలో మధుమేహం రక్తపోటు ఉన్నవారు నెలసరి మందులు ఆశా కార్యకర్త ద్వారా అందజేయాలని పిబ్రవరి 1 నుండి 19 సంవత్సరాల్లో పిల్లలకు నులి పురుగుల కార్యక్రమం ఈ నెలలో జరుగును. కాబట్టి ఆ వయసు ఉన్న వాళ్ళని గుర్తించి కార్యక్రమం గురించి ముందు రోజున తెలియపరచగలరని సిబ్బంది ఆశా కార్యకర్త సమన్వయంతో గ్రామాలలో పనిచేయాలని ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాజేడు వైద్యాధికారి కొమరం మహేందర్ వైద్య సిబ్బంది కోటిరెడ్డి వెంకటేశ్వరావు, ఖలీల్, వెంకటరమణ, మంగ, రఘు, చిన్న, వెంకటేశ్వర్లు, శేఖర్, శ్రీనివాసరావు, నాగేంద్ర కుమారి, సత్య, నాగవేణి, ఛాయదేవి, లలిత, కుమారి, రాజేశ్వరి, కన్యాకుమారి, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News