- జిల్లా కలెక్టర్, డా.ఎస్. వెంకటేశ్వర్
నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) : జిల్లాలో యువతకు ఉపాధి కల్పించే దిశగా జిల్లా నైపుణ్యాభివృద్ధి సంకల్ప ఫండ్స్, ప్రణాళికను రూపొందించాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ జిల్లా వృత్తి నైపుణ్య అభివృద్ధి కమిటీ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరము నందు జిల్లా నైపుణ్య అభివృద్ధి, సంకల్ప ఫండ్స్ మరియు ఇతర ప్రాజెక్టులు కార్యాచరణ ప్రణాళికల గురించి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో నిరుద్యోగ యువత వారు కోరుకుంటున్న రంగంలో దానికి అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించి, వారికి ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సంకల్ప ఫండ్స్ మరియు వినియోగించి ప్లానింగ్ ద్వారా కోర్సులకు శిక్షణ తరగతులు మరియు స్వయం ఉపాధి కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. యువతకు ఎస్వీ యూనివర్సిటీలో నిరుద్యోగ యువతీ యువకులకు ప్రతినెల డ్రోన్ ట్రైనింగ్ మీద శిక్షణ ఇవ్వాలని తెలియజేశారు. RSETI సంస్థ, ద్వారా నారావారిపల్లి లోని యువత కోసం లైట్ మోటర్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ తరగతులు నిర్వహించాలని తెలియజేశారు. సూళ్లూరుపేట నియోజకవర్గం లోని నాయుడుపేట నందు త్వరలో పి ఎం కె వి వై- స్కిల్ హబ్, ఇతర శిక్షణ కేంద్రం లాగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారు అధికారులకు తెలియజేశారు. పీఎం విశ్వకర్మ లో శిక్షణ తీసుకున్న అభ్యర్థులకు త్వరలో వారికి డి బి టి సాయం మరియు టూల్ కిట్స్ అందజేయాలని అంతేకాకుండా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలియజేశారు మరియు జిల్లాలోని 21 సంవత్సరాలు పైన ఉన్న మరియు 24 సంవత్సరాల లోపల ఉన్న యువతీ యువకులు, పీఎం ఇంటర్న్ షిప్ పథకం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంటర్న్ షిప్ అవకాశాలు అందిపుచ్చుకోవాలని తెలియజేశారు. పీఎం ఇంటర్నషిప్, పీఎం విశ్వకర్మ, పీఎంకెవివై పథకాల ప్రోగ్రెస్ సమీక్షిస్తూ ఆంధ్ర ప్రదేశ్ లో తిరుపతి జిల్లా మొదటి స్థానం లో ఉన్నందుకు జిల్లా నైపుణ్యభివృద్ధి అధికారిని అభినందించారు. తిరుపతి జిల్లాలోని యువతి యువకులను ఉద్దేశించి రాబోయే రోజుల్లో ప్రతి ఒక నియోజకవర్గంలో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహించి ఉపాధి అవకాశాలు మెరుగ్గా కల్పించాలని తెలియజేశారు.
అలాగే జిల్లాలో డిమాండ్ ఉన్న కోర్సులను గుర్తించాలని జిఎం, పరిశ్రమలు, డిఇఓ, ఎంప్లాయిమెంట్, పిడి, డిఆర్డిఏ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని భారీ మరియు మధ్యతరగతి పరిశ్రమంలోని అవకాశాలను ఇదివరకే గుర్తించడం జరిగింది ఈ గుర్తించిన అవకాశాలను యువతకి జాబ్ మేళాల ద్వారా ఇండస్ట్రీ కష్టమైసేడ్ స్కిల్ ట్రైనింగ్ ద్వారా ఉపాధి కల్పించవలసిందిగా ఆదేశించారు. జిల్లాలో పదవ తరగతి , ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, ఇంజనీరింగ్ కోర్సులు చేసిన వారిని గుర్తించి వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
అలాగే ఎలక్ట్రీషియన్ , వైర్ మెన్, మోటార్ మెకానిక్ విభాగాలతో ప్లంబర్ , కార్పెంటర్ తదితర అంశాల్లో కూడా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో డిస్ట్రిక్ స్కిల్ డెవలప్మెంట్ కమిటీ కన్వీనర్ డిఆర్డిఏ ,ప్రాజెక్ట్ డైరెక్టర్, T.N.శోభన్ బాబు గారు, జిఎం, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ శ్రీరామ్ మూర్తి, , జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి, ఆర్. లోకనాథం శ్రీ పద్మావతి యూనివర్సిటీ మరియు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రతినిధులు, ఎల్డిఎం విశ్వనాథ రెడ్డి, ఎడి న్యాక్ సతీష్ చంద్ర, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి, వెంకటరమణ, శ్రీమతి .సరిత, జి డి ఎం, సీడప్, ఐటిఐ, పాలిటెక్నిక్ కన్వీనర్స్, ఎస్ సి , ఎస్టి,బీసీ, డిడి,సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, మైనారిటీ కార్పొరేషన్ ఈడీలు, ఏపీ ఎస్ఎస్డిసి, నాక్, సీడ్ యాప్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.