నేటి సాక్షి పలాస కాశీబుగ్గ రమేష్ కుమార్ పాత్ర : గ్రామ సభలతోనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర కోశాధికారి జె శ్రీనివాసరావు అన్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం సింగుపురం శాఖా గ్రంధాలయంలో ఆదివారం ఐక్యవేదిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం సూచించిన గ్రామసభలో నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామసభల ఆవశ్యకత, ప్రజల భాగస్వామ్యంపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ఏడాది ఏప్రిల్ 14, జూలై 1, అక్టోబర్ 3, జనవరి 2న గ్రామసభలో నిర్వహించాలని, వీటిపై వారం రోజులు ముందుగానే దండోరా వేసి ప్రజలకు తెలియజేయాలని చట్టం చెబుతున్న అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
- ఇటీవల కలెక్టర్ స్పందనలో జిల్లా పంచాయతీ అధికారిణికి గ్రామ సభ నిర్వహించాలని ఫిర్యాదు చేసిన ఎటువంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
- జనవరి 2న జరగాల్సిన గ్రామ సభలను విజయవంతం చేసేందుకు కార్యచరణ చేపట్టాలని ఐక్యవేదిక సభ్యులకు సూచించారు.
- ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉంగటి వెంకటరమణ, కుమిలి రాజేష్, సిమ్మ రాజారావు, నక్క లక్ష్మణరావు, పిన్నింటి శ్రీనివాసరావు, బలగ వెంకటరమణ, బట్న నవీన్ తదితరులు పాల్గొన్నారు.

